గతం మరచిన జాతికి భవిష్యత్తు చీకటి. మనం ఎవరమో , ఎప్పుడు ఎక్కడ బయలుదేరామో..బతుకుదారిలో ఎలాంటి కష్టాలు పడ్డామో.. ఏ గొప్పలు చూశామో, ఏ తప్పులు చేశామో తెలిస్తే తప్ప గత కాలం గురించి సరైన అవగాహన కలగదు. గతం తెలియనిదే వర్తమానం అర్దం కాదు. భవిష్యత్తుకు దారీ దొరకదు. దారిదీపం కావలసిన భారత చరిత్ర విదేశీయుల చేతుల్లో అష్తావక్రంగా ఎలా తయారైందో..మహాక్రూరులను మహాపురుషులుగా, జాతీయ వీరులను చిల్లర తిరుగుబాటుదారులుగా చిత్రిస్తూ, విధ్వంసకులను నిర్మాతలుగా కీర్తిస్తూ కుహనా చరిత్రకారులు ఇన్నాళ్ళూ మనల్ని ఎలా మొసగించారో రుజువుచేసే శాస్త్రీయ విశ్లేషణ.అక్బర్ ,షాజహన్ లాంటి దుర్మార్గులను మహాపురుషులుగానూ,అసలైన భారతీయ మహాపురుషులనేమో దుష్టులుగానూ చిత్రించిన కుహనా చరిత్రకారుల బండారాన్ని బయటపెట్టే అపూర్వ సంచలనాత్మక గ్రంథం .దీన్ని చదవటం జీవితంలొ మరచిపోలేని గొప్ప అనుభవం.
Paperback
No comments:
Post a Comment