చేయి చేయి కలిపితేనె… ప్రగతుల తీరం
భారతదేశం… మన జన్మ ప్రదేశంభారత దేశం… మన జన్మ ప్రదేశం
భారత ఖండం… ఒక అమృత భాండం
నిర్మల సుర గంగాజల… సంగమ క్షేత్రం
రంగుల హరివిల్లులు.. విలసిల్లిన నిలయం
భారత దేశం మన జన్మ ప్రదేశం
భారత ఖండం… ఒక అమృత భాండం
ఉత్తరాన ఉన్నతమై… హిమగిరి శిఖరం
దక్షిణాన నెలకొన్నది… హిందు సముద్రం
తూరుపు దిశ పొంగి పొరలె గంగా సంద్రం
పశ్చిమాన అనంతమై… సింధు సముద్రం
భారత దేశం మన జన్మ ప్రదేశం
భారత ఖండం… ఒక అమృత భాండం
ఒకే జాతి సంస్కృతి… ఒకటున్న ప్రదేశం
రత్నగర్భ పేరుగన్న… భారత దేశం
ధీర పుణ్య చరితలున్న… ఆలయ శిఖరం
సత్య ధర్మ శాంతులున్న… ప్రేమ కుటీరం
భారత దేశం… మన జన్మ ప్రదేశం
భారత ఖండం… ఒక అమృత భాండం
కోకిలమ్మ పాడగలదు జాతీయగీతం
కొండ కోన వాగు పాడు… సంస్కృతి గీతం
గుండె గుండె కలుసుకొనుటె… సమరస భావం
భారత చేయి చేయి కలిపితేనె… ప్రగతుల తీరంఖండం… ఒక అమృత భాండం
ఆంధ్ర తమిళ కర్ణాటక కేరళ నిలయం
వంగ త్రిపుర అస్సాములు వెలసిన హారం
రాజస్థాన్ గుజరాత్ పంజాబు ప్రాంగణం
కన్యా కుమారి మొదలు కాశ్మీరం సుందరం
భారత దేశం… మన జన్మ ప్రదేశం
భారత ఖండం… ఒక అమృత భాండం
నిర్మల సుర గంగాజల… సంగమ క్షేత్రం
రంగుల హరివిల్లులు.. విలసిల్లిన నిలయం
భారత దేశం… మన జన్మ ప్రదేశం
భారత ఖండం… ఒక అమృత భాండం
No comments:
Post a Comment