Friday, 28 May 2021

ప్రాణామాయాలు

 ---------------------------

ప్రాణాయామం.

--------------------

ప్రాణాయామం అనగా ప్రాణమును అయనము చేయుట. అనగా ప్రాణశక్తిని విస్తృత పరచుట మరియు స్వాధీన పరచుకొనుట. శరీరం యొక్క క్రియలను వ్యక్తపరిచేది ప్రాణశక్తి. ప్రాణాయామం అంటే ఆ ప్రాణశక్తిని గురించిన జ్ఞానం మరియు నియంత్రణ. శ్వాస ద్వారా ప్రాణశక్తిని నియంత్రించుట. 


ప్రాణాయామంలో కొన్ని రకములు. 

---------------------------------------------

1. అనులోమ విలోమ ప్రాణాయామం. 

2. సూర్య భేదన ప్రాణాయామం. 

3. శీతలి ప్రాణాయామం. 

4. శిత్కారి ప్రాణాయామం. 

5. నాడీ శోధన  ప్రాణాయామం. 

6. భ్రామరి ప్రాణాయామము. 

7. భస్త్రిక ప్రాణాయామము మొదలైనవి ముఖ్యమైనవి. సాధారణ ప్రాణాయామం అయిన అనులోమ విలోమ ప్రాణాయామం గురించి తెలిసుకుందాం. 


అనులోమ - విలోమ ప్రాణాయామం. 

------------------------------------------------

పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ కూర్చోవాలి. ఎడమ ముక్కు రంద్రమును కుడి చేతి ఉంగరపు వ్రేలితోను చిటికిన వ్రేలుతోను కలిపి మూసి ఉంచి, కుడి ముక్కు రంధ్రము ద్వారా గాలి ని పీల్చికొనవలెను. తర్వాత కుడి ముక్కు రంధ్రమును బ్రొటన వ్రేలుతో మూసి, ఎడమ ముక్కు రంధ్రము ద్వారా గాలిని పూర్తిగా  విడిచిపెట్టవలెను. మళ్ళీ గాలిని పీల్చుకొనవలెను. ఇప్పుడు ఎడమ ముక్కును మూసి కుడి ముక్కు ద్వారా గాలిని విడిచివేయవలెను. అదే విధంగా అనేక పర్యాయములు చేయవలెను. 


ప్రాణాయామంలో దశలు. 

----------------------------------

1. పూరకం - శ్వాస తీసుకొనుట. 

2. రేచకం - శ్వాస విడుచుట. 

3. అంతర్ కుంభకం - శ్వాసను లోపల బంధించుట. 

4. బాహ్య కుంభకం - శ్వాసను బయట బంధించుట. 


ప్రాణాయామం ప్రయోజనాలు.

---------------------------------------

1. 21 రోజులు నిరంతరం ప్రాణాయామం చేయండి, ఆరోగ్యం బాగుపడుతుంది.


2.ఉపిరితిత్తులలోని కోవిడ్ 19 సమస్యలు కూడా నయం చేయడానికి సహాయపడతాయి.


3.ప్రాణాయామం ఏకాగ్రతను పెంచుతుంది.


4.ప్రాణాయామం ద్వారా రోజూ తాజాదనాన్ని అనుభవించవచ్చు.


5.ప్రాణాయామం శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది.


6. ప్రాణాయామంతో చర్మం మెరుస్తూ ఉంటుంది.


7. ఉబ్బసంలో ప్రయోజనాలను అందిస్తుంది.


8. శ్వాస ఉబ్బరం సమస్యను తొలగిస్తుంది.


9. ప్రాణాయామం ఆందోళనను తొలగిస్తుంది.


10. డయాబెటిస్‌లో ప్రయోజనాలను ఇస్తుంది.


11. హార్మోన్లు సమస్యను తొలగిస్తాయి.


12. రక్తపోటు సమస్యను తొలగిస్తుంది.


13. అధిక కొలెస్ట్రాల్ సమస్యను తొలగిస్తుంది.


14. క్యాన్సర్‌లో ప్రయోజనాలను ఇస్తుంది.


15. నాడీలను శుద్ధి చేస్తుంది.


16. ప్రాణ శరీరాన్ని శక్తితో నింపుతుంది.


17. ప్రాణాయామం గాఢనిద్రకు దారితీస్తుంది.


18. బరువు తగ్గడానికి ప్రాణాయామం సహాయపడుతుంది.


19. థైరాయిడ్ సమస్యలో ప్రయోజనం ఉంది.


20. స్వరంలో మాధుర్యం వస్తుంది. 


21. చట్చక్రాలు ఉత్తేజం పొందుటకు  ప్రాణాయామం సహాయపడుతుంది.


22. ముక్కు శుభ్రంగా ఉంటుంది.


23. రోగనిరోధక శక్తి వ్యవస్థను బలపరుస్తుంది.


24. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. జీర్ణక్రియ క్రమబద్ధమవుతుంది. 


25. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది


26.అలెర్జీ నుంచి ప్రయోజనం పొందవచ్చు. 


27. మైగ్రేన్‌ వంటి తీవ్ర తలనొప్పి తగ్గును. 


28. విశ్వాస స్థాయిని పెంచుతుంది.


29. భయాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది.


30.పని సామర్థ్యాన్ని పెంచుతుంది..



కదం కృష్ణమూర్తి

మనో వికాస యోగ

  Slide 1: Introduction Title: Why Personality Matters? Content: A positive personality helps in personal and professional success. It buil...